కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సఫారీ బౌలర్లు విజృంభించారు. దీంతో 33 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి 31 పరుగుల వద్ద ఓలీవర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మరో రెండు పరుగులకే భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 15 పరుగులు…
టీమిండియా ఓపెనర్, యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో అజాజ్ పటేల్‌తో పాటు మాయంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. ఈ అవార్డు అజాజ్‌నే వరించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన ముంబై టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ చరిత్ర…
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్‌టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం…
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్‌లో ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. Read Also: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ…
టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచి అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు. Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్ న్యూజిలాండ్‌పై…
2021 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి సత్తా చాటిన క్రికెటర్లలో హర్షల్ పటేల్ ఒకడు. ఈ సీజన్లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా అతడు నిలిచాడు. అయినా ఆర్సీబీ జట్టు హర్షల్ పటేల్‌ను రిటైన్ చేసుకోలేదు. కేవలం కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకుంది. తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలపై హర్షల్ స్పందించాడు. 2022 రిటెన్షన్‌లో తన పేరు ఉండదని తనకు ముందే…
జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్ ఎల్గార్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ…
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా…
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈనెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధన ఆసక్తి రేపుతోంది. ఇక నుంచి బౌలింగ్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే మైదానంలో 30 గజాల సర్కిల్ బయట ఉండే ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. స్లో ఓవర్ రేటుకు పడే జరిమానాకు ఇది అదనం…
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…