వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు. అయితే రెండో వన్డే కోసం అతడు జట్టుతో చేరిపోయాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్‌తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కరోనా నుంచి కోలుకున్న బౌలర్ నవదీప్ సైనీ కూడా జట్టుతో చేరారు. దీంతో బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.
Read Also: పలు ఫ్రాంచైజీలు సంప్రదించాయి.. అయినా ఆర్సీబీతోనే ఉంటా: కోహ్లీ
కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో తొలి వన్డే ఆడిన ఇషాన్ కిషాన్‌పై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇషాన్ కిషాన్‌ను జట్టులో కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తే రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపి దీపక్ హుడాపై వేటు వేసే అవకాశం ఉంటుంది. అయితే సైనీకి ఎవరి స్థానంలో చోటు కల్పిస్తారో చూడాలి. తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు తొలి వన్డేలో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించిన భారత్… రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.