ఐపీఎల్ వేలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేలం పాట పాడుతున్న హ్యూజ్ ఎడ్మీడ్స్ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు వేలాన్ని ఆపేశారు. అయితే అతడికి ఏమైందనే విషయం ఇంకా తెలియరాలేదు. అప్పటికి శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగా రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. ఈ ఘటనతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు.