టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో ప్రచారం జరిగింది. 2017లో అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారం ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. 2016లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే.. రెండేళ్ల కాలం పూర్తవకుండానే ఏడాది తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్‌కు తన పద్ధతులతో ఇబ్బందిగా ఉందని తెలిసిందంటూ కుంబ్లే స్వయంగా వెల్లడించడంతో…
త్వరలో జరగనున్న ఐపీఎల్-2022 వేలం బరిలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు 29 ఏళ్ల బండారు అయ్యప్ప అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీడియం పేస్ బౌలర్‌గా, రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా అయ్యప్ప రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 లీగ్‌లో అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. Read Also: ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్-2022 ఇండియాలో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపాడు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు. Read Also: విండీస్‌తో సిరీస్‌కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా…
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పలువురు టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. బాధితుల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది. Read Also: ఆ ఒక్క పరుగు తీయనందుకు.. న్యూజిలాండ్ ఆటగాడికి…
భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది. అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ…
దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు అధికారులు చోటు కల్పించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఈసారి క్రికెట్లో మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. Read Also: ఐపీఎల్ ఆటగాళ్ల…
ఐపీఎల్ 2022 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా వేలానికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ నిర్వహించనుంది. కర్ణాటక ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం హోటల్ బుకింగ్ ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. తాజాగా ఐపీఎల్ పాలకమండలి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. Read Also: స్వదేశంలో భారత్‌ను ఓడించే…
స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నారు. ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడినా ఇంగ్లాండ్ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్‌లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు నేడు భారత్‌కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు…
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ఈ టోర్నీలో బదులు తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో మెహరూబ్ (30) టాప్‌స్కోరర్. భారత బౌలర్లలో రవికుమార్ మూడు, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు…
త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, కోల్‌కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది. Read Also: ఐపీఎల్-15కు…