BCCI: టీమిండియా బౌలర్ భువనేశ్వర్‌కు హెచ్చరిక.. ఇదే చివరి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్ పరోక్షంగా హెచ్చరించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌కుమార్ రాణించకుంటే పుజారా, రహానే మాదిరి జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ భువనేశ్వర్‌కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చన్నారు. గత ఏడాది ఐపీఎల్ నుంచి భువనేశ్వర్ బౌలింగ్‌లో పదును తగ్గిందన్నారు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి టీ20లో భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ ప్రదర్శన అంత గొప్పదేమీ కాదు. అయితే రెండు, మూడు టీ20ల్లో భువనేశ్వర్ మెరుగైన ప్రదర్శన చేయకపోతే అతడిపై భవిష్యత్‌లో వేటు పడే అవకాశం ఉందని సెలక్టర్లు సూచనప్రాయంగా చెప్పేశారు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల్లో రెండు మాత్రమే ఆడిన భువనేశ్వర్ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో విండీస్‌తో సిరీస్‌లో వన్డేలకు ఎంపిక కాలేదు.
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!