ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత 14 ఏళ్లుగా రైనా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడి ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించాడు. ఈ నేపథ్యంలో రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కరోనా కారణంగా 2020 సీజన్‌లో రైనా ఆడకపోయినా 2021 సీజన్‌లో అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అయితే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని వేలంలో కొనుగోలు చేయకపోవడం సరికాదని రైనా అభిమానులు, సీఎస్కే అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సురేష్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తమ దగ్గర ఉన్నప్పటికీ చెన్నై యాజమాన్యం సురేష్ రైనాను ఎంపిక చేయలేదంటూ ఓ అభిమాని నిట్టూర్చాడు. రైనాను సీఎస్కే కొనుగోలు చేయకపోవడాన్ని నమ్మలేకపోతున్నానని, ధోనీ తప్పకుండా అతడి కోసం ప్రయత్నించి ఉండాల్సిందంటూ మరో అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. అయితే తమ జట్టులో కూర్పులో ప్రస్తుతం రైనా సరిపోడు అంటూ చెన్నై సూపర్‌కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ స్పష్టం చేయడంపైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Suresh Raina's IPL CAREER#IPL2022 💔💔 pic.twitter.com/9ZSEXZsZjl
— S A G A R (@SagarFacts) February 15, 2022