IPL Mega Auction: శివం దూబేకు ఒకేరోజు రెండు గుడ్‌న్యూస్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే ఆదివారం నాడు రెండు గుడ్ న్యూస్‌లు అందుకున్నాడు. అతడు ఆదివారం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ముంబై వాసి శివం దూబే గత ఏడాది గర్ల్‌ఫ్రెండ్ అంజుమ్‌ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం అంజుమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివం దూబే తన భార్య, కొడుకు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో శివం దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇలా ఒకేరోజు రెండు శుభవార్తలు శివం దూబేను సంతోషపరిచాయి.
అయితే ప్రతి ఏడాది ఐపీఎల్‌లో శివం దూబే రేటు తగ్గుతూ వస్తుండటం గమనార్హం. 2019 సీజన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు రూ.5 కోట్లకు దూబేను సొంతం చేసుకుంది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4.40 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. తాజా వేలంలో రూ.4 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతమయ్యాడు. టీమిండియా తరఫున శివం దూబే 13 టీ20లు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. టీ 20 మ్యాచ్‌ల్లో 105 పరుగులు చేసిన అతడి యావరేజ్ స్కోర్ 17.50 పరుగులు. ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌ల్లో 399 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 120.5గా నమోదైంది. ఇందులో 24 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్‌లో 24 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు.
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!