టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తొలుత ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దీంతో అతడు మళ్లీ రెండోసారి వేలానికి వచ్చాడు. రెండోసారి మాత్రం అతడిని ఈ ఏడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్న కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ సాహాను రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను రూ.1.7 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
వేలంలో అమ్ముడుపోయిన ఇతర ఆటగాళ్ల వివరాలు:
★ ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.8 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
★ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ను రూ.2.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
★ ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్‌ను రూ.3.6 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
★ దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడిని రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
★ టీమిండియా స్పిన్నర్ కరణ్ శర్మను రూ.50 లక్షలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.
★ వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ ఎవిన్ లూయిస్‌ను రూ.2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
★ ఇంగ్లండ్ వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
★ దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ను రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది
★ ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ అబాట్‌ను రూ.2.4 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
★ ఇంగ్లండ్ పేస్ బౌలర్ టైమల్ మిల్స్‌ను రూ.1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
★ జేసన్ బెహండార్ఫ్‌ను రూ.75 లక్షలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది.
★ న్యూజిలాండ్ స్పిన్నర్ శాంట్నర్‌ను రూ.1.9 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది
★ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ శామ్స్‌ను రూ.2.6 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
★ భారత ఆటగాడు రిషి ధావన్‌ను రూ.55 లక్షలతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
★ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్‌ను రూ.50 లక్షలకు చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకుంది.