టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే ఆదివారం నాడు రెండు గుడ్ న్యూస్‌లు అందుకున్నాడు. అతడు ఆదివారం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ముంబై వాసి శివం దూబే గత ఏడాది గర్ల్‌ఫ్రెండ్ అంజుమ్ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం అంజుమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివం దూబే తన భార్య, కొడుకు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో శివం దూబేను రూ.4 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇలా ఒకేరోజు రెండు…
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను తొలుత ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దీంతో అతడు మళ్లీ రెండోసారి వేలానికి వచ్చాడు. రెండోసారి మాత్రం అతడిని ఈ ఏడాది ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ సాహాను రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను రూ.1.7 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన ఇతర ఆటగాళ్ల వివరాలు:★ ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.8…
ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ తగిలింది. అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది. అండర్-19…
బెంగళూరులో ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్ కనీస ధర రూ.కోటి కాగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా అతడిని రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ హిట్టర్ కావడంతో అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడింది. అతడు బంతితోనేగాక బ్యాట్‌తోనూ ఆటను మలుపు తిప్పగలడు. బంతితో సమర్థంగా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్…
ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వైదొలగడంతో కొత్త కెప్టెన్ కోసం వెతికే పనిలో ఆ జట్టు ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న వేలంలో శనివారం రోజు ఆర్సీబీ జట్టు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. అయితే ఆర్సీబీ 100 శాతం డుప్లెసిస్‌నే సారథిగా ప్రకటిస్తుందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు జట్టులో ఉండటం వల్ల సమతూకం వస్తుందని, ఐపీఎల్లో అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయన్నాడు.…
ఐపీఎల్ వేలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేలం పాట పాడుతున్న హ్యూజ్ ఎడ్మీడ్స్ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు వేలాన్ని ఆపేశారు. అయితే అతడికి ఏమైందనే విషయం ఇంకా తెలియరాలేదు. అప్పటికి శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగా రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. ఈ ఘటనతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు.
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్లోని తొలి లాట్లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం. ఈ జాబితాలో…
సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన…
గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత రీతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించిన విషయం ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. ఈ సిరీస్ విజయం సాధించడంలో తాత్కాలిక కెప్టెన్ రహానె కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని రహానె విమర్శించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం, పలువురు…