ఐపీఎల్ 2022కు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. మరో 50 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ భావిస్తోంది. అయితే టోర్నీ ప్రారంభం కాకముందే ఆ జట్టుకు పెద్ద దెబ్బ తగిలిందని తెలుస్తోంది. కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడని సమాచారం. ఎందుకంటే అతడు త్వరలోనే…
ఇటీవల యువ భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కెప్టెన్ యశ్ ధుల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతడు రంజీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మేరకు ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యశ్ ధుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. గౌహతి వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి యశ్ ధుల్ సెంచరీతో రాణించాడు. మొత్తం 150 బంతులు ఆడి 113 పరుగులు చేశాడు. అతడి…
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్ పరోక్షంగా హెచ్చరించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌కుమార్ రాణించకుంటే పుజారా, రహానే మాదిరి జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ భువనేశ్వర్‌కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చన్నారు.…
కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ ఐదో బంతికే బ్రెండన్ కింగ్ (4)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్‌కు 8 పరుగుల వద్ద లైఫ్ దొరికింది. అతడిచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో రవి బిష్ణోయ్ బౌండరీ లైన్…
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అటు బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానంలో ఉండగా… ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో అతడు నాలుగు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు టీ20ల్లో ఇదే తొలి సిరీస్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్…
మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో తమ జట్టును నడిపించే సారథిని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ముగిసిన వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత సీజన్లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు గంగూలీ, బ్రెండన్ మెక్‌కలమ్,…
త్వరలో ఐపీఎల్-15 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐపీఎల్ మెగా వేలం కూడా పూర్తయింది. అయితే సన్‌రైజర్స్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని.. ఈ మేరకు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందో సూచన ప్రాయంగా చెప్పేశాడు. కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్‌కు వస్తారని… ఆ…
ఈనెలాఖరులో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు టీమిండియాతో మూడు టీ20లతో పాటు రెండు టెస్టులను శ్రీలంక ఆడనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్టులు, తర్వాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ సవరించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న…
ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత 14 ఏళ్లుగా రైనా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడి ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించాడు. ఈ నేపథ్యంలో రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కరోనా కారణంగా 2020 సీజన్లో రైనా ఆడకపోయినా 2021 సీజన్లో అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అయితే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని వేలంలో కొనుగోలు…