అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోరును చేరుకోవడంతో న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 3,307 పరుగులతో అగ్రస్థానలో కొనసాగుతున్నాడు. గప్తిల్ (3,299 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (3,296 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీ రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ నాలుగు సెంచరీలతో టాప్‌లో ఉండగా.. గప్తిల్ రెండు సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయితే హాఫ్ సెంచరీల రికార్డు మాత్రం కోహ్లీ పేరిట నమోదైంది. కోహ్లీ ఇప్పటివరకు 30 హాఫ్ సెంచరీలు చేశాడు.