GVL Narasimha Rao: దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఇవాళ జరిగిందని.. మొదటిగా ఈ సమావేశం చాలా ఆలస్యంగా జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది అని కూడా సమావేశంలో మాట్లాడానని ఆయన తెలిపారు. ఈ కమిటీలో కేంద్ర పధకాల అమలు గురించి చర్చించామన్నారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందన్నారు. జలజీవన్ మిషన్ వంటివి అమలు సరిగా జరగడం లేదని, ఇళ్ళ నిర్మాణం మూడు నెలల్లో పూర్తిచేయాలని చెప్పానని ఆయన పేర్కొన్నారు. NREGS నరేగా పథకం అమలుపై చర్చించామన్నారు. రైతుల బీమా చెల్లించలేదని అధికారులే చెప్పారని.. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చొద్దని కోరానన్నారు. తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్‌సీబీసీ నిర్ణయించిందన్నారు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్నారు. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని, ఎన్‌సీబీసీ సమావేశాన్ని కేంద్రం నిర్వహించిందన్నారు.
Also Read: Bhatti Vikramarka: మాదాపూర్, హైటెక్ సిటీలా.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి…
కమ్యూనిష్టులు దిక్కు తోచక ప్రధానిపై అనేక ఏడుపుకొట్టు మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారని.. తెలంగాణలో ఒకటో రెండో సీట్లు పొందారు… ఏపీలో కూడా సీట్లు కోసం కమ్యూనిష్టులు ఇలా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉందన్నారు. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు అని ఆయన అన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ.. “ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. ఇండియా అలయెన్స్‌లో ఒకరిపై ఒకరికి అసహనం ఉంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది. మరెవరినైనా కలుపుకోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. రాజకీయాల్లో రేపెలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి. జనసేన పొత్తుపై మాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు.” అని ఆయన అన్నారు.