V Srinivasa Rao: అన్నయ్య కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్‌కు అమ్ముతావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Srinivasa Rao: అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని ఆర్ఎస్ఎస్‌కు అమ్ముతావా? అంటూ ప్రశ్నించారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని తిరుపతికి వస్తున్నారు.. తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారు.. అంటే బుల్డోజర్ పాలన కావాలా.? అని నిలదీశారు.. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్.. బీజేపీని ఏ నాడైనా ప్రశ్నించారా..? బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించి.. ఇప్పుడు ఎందుకు బీజేపీకి వంత పాడుతున్నారు.. పవన్ పాచిపోయిన లడ్డూలు తెచ్చి తిరుపతి వెంకన్న ముందు పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Chiru: బాలయ్య డైరెక్టర్ తో మెగా 157?
Also Read
ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు శ్రీనివాసరావు.. ప్రత్యేక హోదాపై ప్రజలే నిరసనలు నిర్వహిస్తారన్నారు. ఇక, అన్నయ్య కాంగ్రెస్ కు అమ్మేస్తే.. పవన్ ఆర్ఎస్ఎస్ కు అమ్ముతావా? అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పార్టీని ఆర్ఎస్ఎస్ లో విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. జన సైనికులను పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారు.. జన సైనికులారా పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించండి అంటూ పిలుపునిచ్చారు సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!