సీపీఎం జాతీయ సమావేశాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకీయ విధానం పార్టీకీ ముఖ్యమని, కానీ రాజకీయ విధానం ఎప్పుడు ఒకేలా ఉండదన్నారు. పరిస్థితికి అనుగుణంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ మార్గాలను ఎంచుకున్నారని, కాళేశ్వరం ఒక్కటే తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చదన్నారు. ఆంధ్రా వాళ్ళ వల్లనే మనకు ఉద్యోగాలు రావడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. కాళేశ్వరం కేవలం ఐదు జిల్లాలకే పరిమితమైందని తమ్మినేని అన్నారు. తెలంగాణ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. సీపీఎం పార్టీ అని తెలిపారు.
Read Also: కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశాం: మంత్రి హరీష్ రావు
రాహుల్ గాంధీ కూడా నేనే హిందువునే అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. సాఫ్టు హిందుహిజాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యామ్నాయం అంటే రాజకీయ ప్రత్యామ్నాయం కాదు.. ప్రజలకు అవసరం అయ్యే విధానంలో మేము ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటామని తమ్మినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా లెఫ్ట్ పార్టీల విస్తరణ పెరిగితే బాగుంటుందని అన్నారు. తెలంగాణలో లెఫ్ట్ పార్టీల ఐక్యత కేంద్రంగా మిగిలిన శక్తుల ఐక్యత తేవాలని తమ్మినేని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో స్మశాన వాటికలకు వైకుంఠ ధామం పేరు పెడుతున్నారు. స్మశానం కాపరి శివుడు కదా… విష్ణువుకు ఏం సంబంధం అని తమ్మినేని ప్రశ్నించారు. శైవం నీ పక్కదారి పట్టించి.. వైష్ణవాణ్ణి చొప్పించే కుట్ర జరుగుతుందని తమ్మినేని అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తే కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కేసీఆర్‌తో పని చేస్తాం అంటే…ఎన్నికల్లో కలిసి పని చేస్తాం అని కాదని పోరాటాల్లోనేనని ఆయన అన్నారు ఎన్నికల్లో టీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోతుంది అనుకుంటే అది భ్రమగానే మిగిలిపోతుందన్నారు. తెలంగాణలో పాలన విధానం మారకుండా రాష్ట్రం బాగుపడదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.