హైద్రాబాద్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమావేశాల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉంటే ఆర్‌ఎస్‌ఎస్ విధానాలనే అమలు చేస్తుందన్నారు. 2019లో అధికారంలోకి రాగానే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ప్రజా ఉద్యమాలతోనే కేంద్రం దిగి వస్తోందని ఏచూరి అన్నారు.
Read Also: దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్న ఒమిక్రాన్
రైతాంగ పోరాటం మొదటి సారిమోడీని లొంగదీసిందన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు కూడా పూర్తిగా దిగజారాయని ఏచూరి అన్నారు. కమ్యునిస్టులుఉ చైనా ఏజెంట్స్ అని ప్రచారం చేస్తున్నారు. చైనాతో సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. ఆ పని మోడీ చేయకుండా నిందలు వేస్తున్నారని ఏచూరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు ఏచూరి పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆపోరాటాలు అవసరమని ఏచూరి అన్నారు.