కేసీఆర్‌కి లెఫ్ట్ పార్టీలు దగ్గరయ్యేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలు డిఫరెంట్. ఎప్పుడు ఏ జెండా కిందకు వెళ్తాయో.. ఎలాంటి అజెండాను ఎత్తుకుంటాయో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం కొత్త దోస్తీకి కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇంతకీ ఏంటా పార్టీలు?
టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడానికి ఉన్న అభ్యంతరాలేంటి?
తెలంగాణలో రాజకీయం కాక మీద ఉంది. రెండు, మూడు నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలనొప్పే అని డిసైడ్ అయినట్టు ఉంది టీఆర్ఎస్. కొత్తగా మిత్రుల్ని వెతుక్కునే పనో ఏమో.. జాతీయ నాయకులను ఇంటికి పిలిచి విందు రాజకీయం చేస్తోంది గులాబీ పార్టీ. CPI ప్రధాన కార్యదర్శి D రాజా, CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్. కలిసి పని చేసే విధంగా చర్చలు సాగినట్టు సమాచారం. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. కలిసి పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చారట గులాబీ దళపతి. అయితే సీపీఐ, సీపీఎంల రాష్ట్ర నాయకులకు ఈ అంశంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయట.
Also Read
బీజేపీని దారిలోకి తెచ్చుకునేందుకే విమర్శలు చేస్తున్నారని సీపీఎం అనుమానం?
వాస్తవానికి కొన్నిరోజులుగా TRSతో పరోక్షంగా లెఫ్ట్‌పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి.. హుజురాబాద్ ఉపఎన్నిక వరకు.. లెఫ్ట్‌పార్టీలు మద్దతు పలికింది టీఆర్‌ఎస్‌కే. బీజేపీ గెలుస్తుంది అనుకున్నచోట TRSకి మద్దతు పలికాము అని చెబుతున్నా.. TRSతో చెట్టపట్టాల్ వేసుకునే ఉంది లెఫ్ట్. అయితే.. సీపీఎంకు TRS మీద అనుమానాలు ఉన్నాయట. బీజేపీపై సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలు అనుకున్నంత స్థాయిలో లేవనే ఫీలింగ్‌లో CPM ఉందట. పైగా బీజేపీని కేసీఆర్ దారిలోకి తెచ్చుకుంటున్నారేమో అని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ను కాదంటే రాష్ట్రంలో మరొకరితో కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ మీద సానుకూల నిర్ణయం ఉంటే.. అప్పుడు కొంత వ్యూహం మారొచ్చు.
లెఫ్ట్ పార్టీల మధ్యే సఖ్యత లేదు
నిజానికి లెఫ్ట్ పార్టీల మధ్య సఖ్యత లేదు. ఉద్యమాలలో కలిసి పనిచేస్తున్నా ఎన్నికలకు వచ్చే సరికి ఎవరి దారి వారిదే. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలే దానికి ఉదాహరణ. CPI, కాంగ్రెస్ కూటమితో జత కడితే.. CPM.. BLFను ఏర్పాటు చేసింది. చివరకు CPI, CPMలకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో జట్టు కట్టినా.. రాష్ట్రంలో CPIకి ఆ నిర్ణయం రుచించకపోవచ్చు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది చాడా అండ్ బ్యాచ్. ఇక గులాబీ దళపతి వైఖరిని చివరి వరకు నమ్మలేమనే అభిప్రాయం ఉభయ కమ్యూనిస్ట్‌లలో ఉన్నప్పటికీ.. TRSతో కలిసి పనిచేసే విషయంలో కలిసి సాగుతారా లేదా అనేది క్లారిటీ లేదు.
లెఫ్ట్ వైపు ఆశగా చూస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు తమతో కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. AICC స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే కానీ.. ఆపార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అందుకే గులాబీతో సోపతి చేయడానికి తహతహలాడుతున్నాయనే చర్చ మొదలైంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!