షర్మిల ఫోన్ చేశారని ఆమెతో కలిసి పని చేయడానికి మేము కూడా సిద్ధమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కానీ షర్మిలకు మోడీ.. ఆధాని దోపిడీ గుర్తుకు రాలేదని మండిపడ్డారు.
CPM: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో విభేదాలు ఉన్నా.. అవి బయటపడ్డ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.. అంతర్గత సమావేశాల్లో అభిప్రాయ బేధాలు వ్యక్తం అయినా.. నిర్ణయానికి వచ్చేసారికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటారు.. అయితే, ఏపీ సీపీఎంలో అగ్రనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో సీపీఎంలో కీలక నేతగా ఉన్న బీవీ రాఘవులు.. సంచలన నిర్ణయం తీసుకున్నారట.. పొలిట్‌బ్యూరో నుంచి వైదొరడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సీపీఎం పార్టీ కేంద్ర నాయకత్వానికి…
బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలని సీపీఎం జన చైతన్య యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన సభలో సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు.
Kerala: కేరళలో క్రైస్తవ మతగురువు బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉత్తర కేరళలోని తలస్సేరిలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చేసిన ప్రకటనను అధికార కమ్యూనిస్ట్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఖండించాయి. చర్చి సాధారణంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు, అయితే రైతులకు అండగా నిలిచే ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా మద్దతు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం అంటూ సీపీఎం అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది.