Julakanti Ranga Reddy: బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలని సీపీఎం జన చైతన్య యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన సభలో సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. మోడీ ప్రదానమంత్రి అయింది 130 కోట్ల ప్రజల సంక్షేమం కోసం కాదు కార్పోరేట్ శక్తుల ఆస్తులను కాపాడేందుకే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కార్పోరేట్ శక్తులకు జీతగాడిగా పనిచేస్తున్నాడని విమర్శించారు. ప్రశ్నించే వారిపట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు నిచ్చారు.
Read also: CM Jagan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పొదుపు సంఘాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి
నామా నాగేశ్వరరావు..
బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే బిల్లును ఉపసంహారించే వరకు అన్ని పార్టీలు, రైతు సంఘాలు పోరాటం చేశాయని బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. తెలంగాణాలో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలన్నారు. మరొక సారి మనం కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని, కలిసి పనిచేయలన్నారు. ఖమ్మం జిల్లాలో కమ్మ్యూనిస్టులు ఏ పక్షాన ఉంటే ఆ పార్టీయే గెలుస్తుందని అన్నారు. భారత దేశ వ్యాపితంగా సీపీయం ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రలు జరుగుతున్నయన్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్రున్నాయని తెలిపారు. సమర్ధించే వాళ్లనూ సహించే పరిస్థితి మోడీకి లేదన్నారు.
మునుగోడులో బీజేపీ గెలిపిస్తే రాష్ట్రమంతా ఆ ప్రభావం ఉండేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ కూడా మునుగోడు విజయం ఎర్రజండాలదే అంటున్నారని తెలిపారు. ఎక్కడా పొత్తులలో సీట్ల విషయం రాలేదు కానీ, పాలేరుతో పాటు అనేక సెగ్మెంట్ లు ప్రాధాన్యతగా పెట్టుకున్నామన్నారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే దేశం విచ్చిన్నం అవుతుందని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా గౌరవించే పరిస్థితి లేదన్నారు. లౌకికతత్వం దేశంలో కనుమరుగౌతుందని అన్నారు. రానున్న రోజుల్లో రిజర్వేషన్లు అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు. బీసీ గణణ చేస్తే రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుదనే కేంద్రం వెనుకాడుతుందని మండిపడ్డారు. మతతత్వ విధానంపై పోరాడుదాం కానీ.. పేదల విషయంలో పోరాటంపై రాజీకీయమా అన్నారు. లేపర్ల లీకేజిలో దోషులు తప్పకుండా బయటకు రావాలి.. రాహుల్ గాంధీ పై భయంతోనే సస్పెన్షన్ విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మంచి పనులు చేస్తే తప్పకుండా కలిసి పని చేస్తామన్నారు. పంటనష్టంపై మేము మెమోరాండం ఇచ్చామని, ఎకరాకు 20వేలు ఇవ్వాలన్నామని తెలిపారు. మాకు జీవోలు చూపించి సాధ్యం కాదన్నారు కానీ ఒప్పించి 10 వేలు ఇచ్చేలా చేశామన్నారు. కౌలు రైతుల వ్యవహారం కూడా సీయం దృష్టికి తీస్కెళ్ళిన తరువాతే ఆయన వారి గురించి ఆలోచించారని తెలిపారు.
Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?