సీపీఎం పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్రకు కమ్యూనిస్టు పార్టీల నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంలో మహిళకు రక్షణ కరువైందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షసాధింపుగా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
Also Read : Kushboo Sundar: మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్.. ‘పరువు నష్టం కేసు వేస్తారా?’
రాహుల్ గాంధీ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోందని రాహుల్ గాంధీపై కుట్రకు తెర లేపారని ఆయన అన్నారు. కవిత లిక్కర్ కేస్ నేను సీపీఎం పార్టీగా ఖండిస్తున్నామన్నారు. నిజంగా కవిత తప్పుచేసి ఉంటే దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. బీజేపీని ఓడించడానికి సీపీఎం పార్టీ ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని ఆయన అన్నారు. మునుగోడు గెలుపు కమ్యూనిస్టుల వల్లనే సాధ్యమైందని, సీపీఎం పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!