CPI and CPM parties Meeting Today: సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రెండు కమ్యునిస్ట్ పార్టీల (సీపీఐ, సీపీఎం) ముఖ్య నేతల సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకు పల్లి సీతారాములు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలో అనుసరించే ప్రణాళికలపై…
హైదరాబాద్ లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించ లేదని పేర్కొన్నారు.
కూనంనేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టం లేదు.. నష్టపోయేది కేసీఆరే.. బీజేపీతో కేసీఆర్‌కి సఖ్యత వచ్చింది.. మునుగోడులో బీజేపీ ప్రమాదమని చెప్పిన కేసీఆర్‌కి.. ఇప్పుడు బీజేపీతో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది? బీజేపీకి దగ్గరైతే.. కనీస మిత్ర ధర్మం ఉండాలి కదా? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి అని అడిగారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల బీఆర్‌ఎస్ తరుఫున బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. అయితే.. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు. breaking news, latest news, telugu news, big news, cpm,…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ (సీపీఐ, సీపీఎం) పార్టీలతో పొత్తు ఉండదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించాయి. అయితే, పొత్తు విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పింది.