Tammineni Veerabhadram: షర్మిల ఫోన్ చేశారని ఆమెతో కలిసి పని చేయడానికి మేము కూడా సిద్ధమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కానీ షర్మిలకు మోడీ.. ఆధాని దోపిడీ గుర్తుకు రాలేదని మండిపడ్డారు. మైనార్టీల మీద దాడులు జరుగుతున్నా మాటలు రావు ఆమెకి అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. జుగుస్తకరంగా షర్మిల వ్యవహారం అంటూ నిప్పులు చెరిగారు. షర్మిల రాజకీయ నాటకాలు మానుకోవాలని అన్నారు. మేము ఎన్నో సార్లు ఉద్యమాల్లో కలిసి రండి అని పిలిచాం.. ఒక్క రోజు కూడా రాలేదని తమ్మినేని, షర్మిలపై మండిపడ్డారు. సీపీఐ.. సీపీఎం కలిసి పని చేయాలని నిర్ణయించామని అన్నారు. ఏప్రిల్ 9 న సీపీఐ.. సీపీఎం ఉమ్మడి సభ ఉంటుందని, సీట్ల వ్యవహారంలో కూడా సర్దుకుపోవాలి అని నిర్ణయం తీసుకున్నాట్లు వెల్లడించారు. లెఫ్ట్ పార్టీల చరిత్ర లో ఉమ్మడి సభ ఇది మొదటి సారి అని తెలిపారు తమ్మినేని. రాష్ట్ర రాజకీయాల్లో.. బీజేపీ తప్పుడు పద్దతిలో ఎదగాలని చూస్తుందని మండిపడ్డారు.
Read also: Minister KTR: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ రకాలు
ఎన్నికల్లో ఐక్యత కూడా ప్రదర్శించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు ఓ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీబీఐ నిజాయితీ గల సంస్థ మోడీ అన్నారు.. మరి గతంలో కాంగ్రెస్ చెప్పినట్టు వింటుంది మోడీనే అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా కూడా సీబీఐ.. నన్ను అప్రూవర్ కావాలని చెప్పినట్టు ప్రకటించారని తెలిపారు. ఇప్పుడేమో గొప్పది అంటున్నారని ఎద్దేవ చేశారు. కవిత తప్పు చేస్తే శిక్షించాలని కోరారు. కేసీఆర్ పార్టీ పై వేధింపులు మానుకోవాలని, కక్ష సాధింపు కేసులు వద్దన్నారు. పరీక్ష పత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇద్దరి నిందితులు అని చెప్పడం సరికాదన్నారు తమ్మినేని. గతంలో సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఖండించారు. ఖమ్మంలో మేము మద్దతు ఇవ్వలేదనేది సరికాదన్నారు. 2014 ఎన్నికల్లో మేము వైఎస్ఆర్సిపి కి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు.
Writeoff Loans: రుణాలను రైటాఫ్ చేస్తే చెల్లించాల్సిన పనిలేదా? నిర్మలాసీతారామన్ ఏమంటున్నారంటే..