Kerala: కేరళలో క్రైస్తవ మతగురువు బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉత్తర కేరళలోని తలస్సేరిలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చేసిన ప్రకటనను అధికార కమ్యూనిస్ట్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఖండించాయి. చర్చి సాధారణంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు, అయితే రైతులకు అండగా నిలిచే ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా మద్దతు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Asaduddin Owaisi: సీఎం వల్లే ఆర్జేడీలోకి మా ఎమ్మెల్యేలు.. ఈ సారి ఎక్కువ స్థానాల్లో పోటీ..
తలస్సేరిలో జరిగిన ఆదివారం జరిగిన క్యాథలిక్ రైతుల సదస్సులో బిషప్ ప్రసంగిస్తూ.. దేశంలో అధికార బీజేపీ పార్టీని చర్చిలకు దూరంగా ఉంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చర్చిలకు బీజేపీ పట్ల అంటరాని వైఖరి లేదని, అన్నింటి కన్నా ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీఅని, రైతుల సమస్యలను పరిష్కరిస్తే బీజేపీకి ఓట్లేస్తాం అని అన్నారు. కేరళలో రబ్బర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రబ్బర్ ధరను రూ. 130 నుంచి రూ.300 పెంచాలని కేంద్రాన్ని కోరారు.
బిషప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంలో చర్చిలు, పాస్టర్లపై జరిగిన దాడులను బిషప్ మరిచిపోయారని అన్నారు. ఎవరూ నక్కతో కోడిని ఉంచరని, చర్చి హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వారికి ఎలా మద్దతు ఇస్తుంది..? అని కేరళ మంత్రి ఎంబీ రాకేష్ ప్రశ్నించారు. అయితే బీజేపీ బిషప్ వ్యాఖ్యలను స్వాగతించింది. క్రైస్తవులు మెజారిటీగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, ఇది కేరళలో కూడా రిపీట్ అవుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. రబ్బరు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం చెప్పారు. కాంగ్రెస్, సీపీఎం రెండూ మైనారిటీ వర్గాల మనసుల్లో భయాలు సృష్టించి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని అన్నారు.