BV Raghavulu: యోగా అందరికీ నేర్పించాలా.. అంతలా నిధులు ఖర్చుపెట్టాలా?
- యోగా కోసం అంతలా నిధులు ఖర్చుపెట్టాలా?
- ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ పాలన ఉంది
- మహిళలకు ఉచిత బస్సు పథకంను స్వాగతిస్తాం
- ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన బీవీ రాఘవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యోగా అందరికీ నేర్పించాలా?.. అంతలా నిధులు ఖర్చుపెట్టాలా? అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాగా రాష్ట్రంలో పాలన కనిపిస్తోందని విమర్శించారు. పోలవరం, అమరావతి అలాగే ఉన్నాయని.. కొత్తగా బనకచర్ల వచ్చిందని విమర్శించారు. సంపద సృష్టిలో ఏదైనా ప్రత్యేక ముద్ర వేయాలి కానీ.. కొత్తగా ఏం చేయక్కర్లేదని సూచించారు. మహిళలకు ఉచిత బస్సును తాము స్వాగతిస్తాం అని బీవీ రాఘవులు తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కోసం విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. జూన్ 21న మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ఈ ఏర్పాట్లపై ఆయన మండిపడ్డారు. వియాయవాడలో సీపీఎం రాష్ట్రస్ధాయి విస్తృత సమావేశాలు ఇవాళ, రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు.
Also Read
Also Read: Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!
‘విశాఖ భవంతిని ప్రజోపయోగంగా చేయలేదు. వైఎస్ జగన్ గురించి మాట్లాడటానికి ఒక మ్యూజియంలా చేశారు. గత ఐదు సంవత్సరాలు వృధా చేసారు.. మరలా వృధా చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు పథకంను మేం స్వాగతిస్తాం. మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఆర్ధిక వ్యవస్ధకు లాభం చేకూరుతుంది. ఉచిత బస్సు వల్ల మహిళలు పురుషులపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రధాని మోడీ చెప్పినట్లు ఆడవారు బయటకి వస్తే అభివృద్ధి అని చెప్పింది నిజం. చాలా ఆలస్యంగా మహిళలకు ఉచిత బస్సు తీసుకొస్తున్నారు. కమ్యూనిష్టులు ఎన్టీఆర్ వచ్చాక స్థానం కోల్పోయారు. తిరిగి సంపాదించలేకపోయారు. కమ్యూనిష్టులకు ఆశలు ఉన్నాయి.. ఆదరణ లేదు’ అని బీవీ రాఘవులు చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు