Polavaram: పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.. పోలవరం ప్రాజెక్టు కోసం పరిహారం పునరావాసం కింద 33 వేల కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు 5200 కోట్లు మాత్రమే ఇచ్చారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. మెజారిటీ నిధులు నిర్వాసితులకు ఇల్లు కట్టిన కాంట్రాక్టర్లకు వెళ్లాయని.. ఇప్పటి వరకు 12,658 కుటుంబాలకు మాత్రమే పునరావాసం పరిహారం అందాయని.. ఇల్లు పొందినవారి నివాసాలు కూడా లీకేజీ గురవుతున్నాయని మంత్రికి తెలిపారు..
Read Also: Telangana Colleges Strike : కాలేజీల బెదిరింపులు, చర్యలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు ఎకరాలకు 20 లక్షల రూపాయలు, పునరావాసం కోసం పది లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞాపన పత్రం అందజేశారు సీపీఎం ప్రతినిధులు.. పునరావాస కాలనీలు 75 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 20 వరకు పూర్తయ్యాయని త్వరగా మిగిలిన కుటుంబాలకు పరిహారం.. పనరావాసం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.. అయితే, పోలవరం భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి త్వరలో కేంద్ర బృందాన్ని పంపిస్తామని సీపీఎం నేతలకు హామీ ఇచ్చారు కేంద్రమంత్రి సి.ఆర్ పాటిల్.. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదు.. పోలవరం నిర్వాసితుల సమస్య తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వామీదే అని మంత్రికి తెలిపారు సీపీఎం నేతలు..
Read Also: CM Siddaramaiah: హిందూ మతంలో సమానత్వం ఉంటే.. మతం ఎందుకు మారుతున్నారు?
ఇక, ఢిల్లీలో మూడు రోజులపాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహించబోతున్నాం.. దేశంలోని తాజా రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై చర్చ జరుగుతుందన్నారు వి. శ్రీనివాసరావు.. భారత్ పై అమెరికా ట్రంప్ టారిఫ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది.. బీహార్ ఎన్నికలు , ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం.. ట్రంప్ టారిఫ్ ల టెర్రరిజం ఇది.. దీనిపై మోడీ ప్రభుత్వం దోబూచులాడుతుంది .. తెర వెనుక అన్ని కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం నిర్వహిస్తుంది.. పత్తిపై ఎలాంటి పన్ను లేకుండా కేంద్ర ప్రభుత్వం దిగుమతులు చేసుకునేందుకు అంగీకరించింది అని విమర్శించారు.. రాబోయే నెల రోజుల్లో దేశవ్యాప్తంగా క్యాంపెనింగ్ నిర్వహించాలని నిర్ణయించాం.. ఏపీలో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకిస్తున్నాం.. కేరళలో ప్రభుత్వ ఆధ్యంలో విద్య ప్రజా ఆరోగ్య నడుస్తుంది. అమలాపురం మెడికల్ కాలేజ్ ఇప్పటికే సగం పూర్తయింది..కంపెనీవారు పనిచేయకుండా వెళ్లిపోయారు.. పాడేరు లో 100 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది.. ట్రైబల్ యూనివర్సిటీకి సైతం క్యాంపస్ లేదు .. వైద్యం, విద్య ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు వి.శ్రీనివాసరావు..