వివాదాస్పద రుషికొండ నిర్మాణాలపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టూరిజం ప్రాజెక్ట్ కోసం ఖరీదైన విల్లాలు తప్ప ప్రచారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నివాస భవనాల స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. అయితే, పర్యావరణంకు జరుగుతున్న హాని మాత్రం క్షమించరానిది అన్న నారాయణ.. మంత్రులు, సలహాదారులపైన ఫైర్ అయ్యారు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప నిజాలు ప్రజలకు తెలియకుండా చూడడం సరైన విధానం కాదన్నారు.. ఆగస్టులో…
అనంతపురం జిల్లా రాప్తాడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి రాజకీయ వివాదాలే. మాజీ మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మధ్యలో రెండు వర్గాలు శాంతించినా.. పరిటాల సునీత పాదయాత్ర చేస్తాననడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని జాకీ పరిశ్రమ వివాదం కొత్తగా చుట్టుముట్టడంతో రాప్తాడులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జిల్లాలో లేని పరిశ్రమ చుట్టూ సాగుతున్న పాలిటిక్స్ ఏకంగా తాడేపల్లిని తాకడంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకో సైలెంట్ అయ్యారనే అనుమానాలను వ్యక్తం చేశారు.. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు.. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అందుకే బీజేపీని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.. ఇప్పటికే తన లేఖల ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఆయన… ఇవాళ లేఖలో.. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.. రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో పేర్కొన్న రామకృష్ణ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్…
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2024 ఎన్నికలు కీలకమైనవని పేర్కొన్న ఆయన.. రీజినల్, డెమోక్రటిక్ పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం అన్నారు.. ప్రస్తుత పరిస్థితిపై లెఫ్ట్ పార్టీలు అధ్యయనం చేస్తున్నాయన్నారు.. ఇండియా సెక్యులర్ దేశంఅని.. మరోవైపు దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.. పేదలను నిత్యావసర ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్య వేధిస్తోందన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన…
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్‌ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని మండిపడ్డారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా సీఎంకు లేఖలు రాస్తూ వచ్చిన రామకృష్ణ… ఈ సారి నకిలీ విత్తనాలు, నష్టపోయిన పత్తి రైతుల గురంచి తన లేఖలో ప్రస్తావించారు.. నంద్యాల కేంద్రంగానే 30 కంపెనీల పత్తి విత్తనాల సరఫరా జరిగినట్లు తెలుస్తోందని పేర్కొన్న ఆయన.. ఎకరాకు దాదాపు రూ.60…