Kunamneni Sambasiva rao: ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్‌ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడాన్ని ఆయన స్వాగతించారు. వేల కోట్లు బ్యాంకులకు బాకీలు ఉన్న వాళ్లను కట్టనివ్వరు కానీ.. పేద రైతులను వేధిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. శ్రీలంక పరిస్థితులే దేశంలో కనిపిస్తున్నాయని ఆరోపించారు.
US Air Show: విన్యాసాలు చేస్తూ ఢీకొన్న 2 యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి
నరేంద్ర మోడీని ప్రశ్నించకూడదా.. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తూ, అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్త గని ఏది వచ్చినా సింగరేణి కాలరీస్ ద్వారానే తీయాలని ఆయన అన్నారు. అరవిందో కంపెనీ కోయగూడెంలో కొత్త మైనింగ్ తీసుకున్నారని.. ఇలా మూడు మైనింగ్ ప్రైవేట్ వాళ్లకు ఇచ్చారని ఆయన అన్నారు. చంద్రగుప్త గనులను ప్రైవేట్ వాళ్లకు ఇచ్చారని.. ఇవి నిజాలు కావా అంటూ ప్రశ్నించారు.