ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.. ఇప్పటికే తన లేఖల ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఆయన… ఇవాళ లేఖలో.. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.. రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో పేర్కొన్న రామకృష్ణ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తరలిపోయినట్లు తెలుస్తోందంటూ.. సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.. పారిశ్రామికవేత్తలను ప్రజాప్రతినిధులు బెదిరిస్తే పరిశ్రమలు ఎలా ఏర్పాటు అవుతాయి? అని ప్రశ్నించారు రామకృష్ణ.. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రకాష్ పై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరిన ఆయన.. తక్షణమే అనంతపురం జిల్లా రాస్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..
Read Also: సోషల్ మీడియాలో తోపులు వీరే.. ఏది ఎంతమంది వినియోగిస్తున్నారో మీకోసం..