మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది.. దీంతో ప్రధాన పార్టీలు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా.. మద్యం ఏరులైపారుతోంది.. ఓటర్లను డబ్బులు ఆశచూపి ఆకట్టుకుంటున్నారు.. మూడు ప్రధాన పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.. ఇక, బీఎస్పీ, కోదండరాం పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. అయితే, ఫైనల్‌గా మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీదే…
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తరువాత పోరాడే వ్యక్తి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు.
అమరావతి రాజధాని విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, అమరావతి రాజధాని అంశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా ఆమోదించిన విషయం వాస్తవమా కాదా..? అని నిలదీసిన ఆయన… ఆనాడే మూడు రాజధానులు కావాలని వైఎస్ జగన్ ఎందుకు చెప్పలేదు..? అని ప్రశ్నించారు… శాసనం, చట్టం, ధర్మాలను విస్మరించి…
అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. సీపీఐ శ్రేణులు పునరుత్తేజంతో పని చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ తో కలిశాం.. సమస్యలు ఎక్కడ ఉంటే సీపీఐ అక్కడ ఉంటుంది.. రాష్ట్రంలో అనేక వర్గాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.. అధికార పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యమాలు, పోరాటాల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.. ఇటీవల జరిగిన…