ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకో సైలెంట్ అయ్యారనే అనుమానాలను వ్యక్తం చేశారు.. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు.. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అందుకే బీజేపీని విమర్శించే సాహసం సీఎం వైఎస్ జగన్ చేయడం లేదంటూ విమర్శించారు. ఇక, దేశానికి గర్వకారణమైన జీ20 సమావేశాలకు నరేంద్ర మోడీ చైర్మన్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమావేశాలకు 20దేశాల ప్రతినిధులు వస్తున్నారు.. ఈ సమావేశాలకి కమలం గుర్తు తరహాలో లోగో పెట్టడం సరికాదు.. వెంటనే ఆ లోగోను మార్చాలని డిమాండ్ చేశారు..
Read Also: YS Jagan Mohan Reddy: రాజకీయాలు చెడిపోయాయి.. వారికి మరో ఛాన్స్ ఇవ్వొద్దు..!
ఇక, మహిళా బిల్లు ఇరవై యేళ్లుగా పెండింగ్‌లో ఉంది.. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున ఆ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు సీపీఐ నేత నారాయణ.. జీ20కి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ.. బిల్లును ఆమోదిస్తే మనకి గౌరవం దక్కుతుందన్నారు.. జీ20సమావేశాలకు ముందే మహిళా బిల్లును ఆమోదించాలని కోరారు.. మరోవైపు, ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చేలా సీబీఐ, ఈడీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం వినియోగిస్తోందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులపై దాడులు రాజకీయ కోణంలో చేస్తున్నారని ఆరోపించారు.. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని సూచించారు.. ఇక, దేశంలో గవర్నర్ వ్యవస్థ అనవసరం.. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ అనుకూలం.. అందుకే ఇక్కడి గవర్నర్ సైలెంట్‌గా ఉంటారు అని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ నేత నారాయణ.