హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2024 ఎన్నికలు కీలకమైనవని పేర్కొన్న ఆయన.. రీజినల్, డెమోక్రటిక్ పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం అన్నారు.. ప్రస్తుత పరిస్థితిపై లెఫ్ట్ పార్టీలు అధ్యయనం చేస్తున్నాయన్నారు.. ఇండియా సెక్యులర్ దేశంఅని.. మరోవైపు దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.. పేదలను నిత్యావసర ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్య వేధిస్తోందన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉన్న ఉద్యోగాలను పీకేసేపనిలో పడ్డారని మండిపడ్డారు.. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది.. కానీ, మోడీ మద్దతు ఇస్తున్న కార్పొరేట్ శక్తులు మరింత బలోపేతం అయ్యాయి.. పేదలు మరింత పేదలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: KCR Congratulates Nikhat Zareen: నిఖత్ జరీన్ కు అర్జున అవార్డు.. అభినందించిన కేసీఆర్
కేంద్రం నేషనల్ విద్యా విధానాన్ని రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దుతుందని ఫైర్ అయ్యారు డి. రాజా.. గవర్నర్ ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను భయపెడుతోందని విమర్శించారు.. గవర్నర్‌లతో బీజేపీ తన అజెండాని అమలుపరుస్తోందని.. అసలు గవర్నర్ పోస్ట్ అవసరమా? అనే చర్చ కూడా జరుగుతోందన్నారు.. ఏదేమైనా.. రాష్ట్ర ప్రభుత్వాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం సరికాదని హితవుపలికారు.. రాజ్యాంగం, డెమోక్రాసి కాపాడటం కోసం సెక్యులర్ శక్తులు అన్నీ ఏకంకావాలి అని పిలుపునిచ్చారు.. జాతీయ స్థాయిలో బీజేపీ ఓటమికి కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని.. రాష్ట్రాలలో కూడా అలాంటి శక్తులతో కలుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపైనే మేం రీజినల్ పార్టీలతో మాట్లాడుతున్నాం.. ఎన్నికలకు ముందే కలిసి పని చేయాలని ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు.
Read Also: Yashoda: సమంత ఓకే అంటే ‘యశోద’ సీక్వెల్ – సక్సెస్‌మీట్‌లో దర్శక నిర్మాతలు
ఇక, తెలంగాణలో ఉమ్మడి కమ్యూనిస్టులు (సీపీఐ, సీపీఎం ఇతర లెఫ్ట్‌పార్టీలు).. టీఆర్ఎస్‌కు ఇటీవల అంటే మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు ఇచ్చాం.. టీఆర్ఎస్, ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు డి. రాజా.. మరోవైపు కాంగ్రెస్ పాన్ ఇండియన్ సెక్యులర్ పార్టీగా అభివర్ణించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. అయితే, ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టాలి.. ఎలా ముందుకు వెళ్లాలి అనేది మాత్రం ఆయా రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ రియలైజ్ కావాల్సిన అవసరం ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా.