వివాదాస్పద రుషికొండ నిర్మాణాలపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టూరిజం ప్రాజెక్ట్ కోసం ఖరీదైన విల్లాలు తప్ప ప్రచారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నివాస భవనాల స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. అయితే, పర్యావరణంకు జరుగుతున్న హాని మాత్రం క్షమించరానిది అన్న నారాయణ.. మంత్రులు, సలహాదారులపైన ఫైర్ అయ్యారు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప నిజాలు ప్రజలకు తెలియకుండా చూడడం సరైన విధానం కాదన్నారు.. ఆగస్టులో రుషి కొండ సందర్శన కోసం హైకోర్టును ఆశ్రయించాను.. మూడు నెలల పాటు నాకు అవకాశం ఇవ్వలేదని.. మళ్లీ కోర్టుకు వెళ్లడంతో ఈ రోజు చూడటానికి అనుమతిచ్చారన్నారు.. నేను చూసి వచ్చాను, ఇక్కడ సీఎం కార్యాలయం లాంటిది కట్టడం లేదన్న ఆయన.. కానీ విలాసవంతమైన భవనాలు కడుతున్నారు. ఈ ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని హత్యాచారం చేసింది.. విల్లాలను ఎక్కడైనా కట్టుకోవచ్చు, అనకాపల్లిలో ఇతర చోట కట్టవచ్చు.. కానీ, ప్రకృతిని నాశనం చేసిన పాపం మాత్రం ఊరికే పోదని హెచ్చరించారు.
Read Also: Road Accidents: ఏపీలో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 10 నెలల్లో 5,831 మంది మృతి
కట్టడం చట్ట ప్రకారమే.. కానీ, కొండను తొలిచేయడం నేరం అన్నారు నారాయణ.. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలలో అధికారులు కూడా రాత్రి బస చేసే అనుమతి లేదన్న ఆయన.. కేవలం పర్యాటకులు ఉండడానికి విల్లాలు మాత్రమే నిర్మిస్తున్నారు.. మిడి మిడి జ్ఞానంతో ఉన్న మంత్రులు మాట్లాడటం వల్ల ఇది ఇంతవరకు వచ్చిందని మండిపడ్డారు.. రుషికొండ వెళ్ళేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన మూడు నెలలకు కానీ ప్రభుత్వం అంగీకరించ లేదు.. నేను ఏమైనా పేలుడు పదార్ధాలు తీసుకుని వెళుతున్నానా..? ఉగ్రవాదినా..!? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఋషికొండలో నిర్మాణ ప్రణాళికలు చూసినప్పుడు రెండు మూడు రకాల రిసార్ట్స్, భవనాలు తప్ప ఎటువంటి ఇతర కట్టడాలు కనిపించడం లేదన్నారు.. ముఖ్యమంత్రి ఇంటి కోసం నిర్మాణంగా జరుగుతున్నది ప్రచారంగానే కనిపించింది.. సీఎం నివాసం వుండే భవంతి లాంటి నిర్మాణాలు ఏవీ ఋషికొండలో కనిపించ లేదన్నారు. కానీ, రుషికొండ ఒరిజినాలిటీ దెబ్బ తీస్తున్నారు.. విశాఖలో చాలా భూములు ఉండగా సహజసిద్ధమైన ప్రకృతిని ఎందుకు దెబ్బతీయాలి.. ఇక్కడ ప్రకృతిపై అఘాయిత్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే, నారాయణతో పాటు మరికొందరు సీపీఐ నేతు రుషికొండ వెళ్లేందుకు ప్రయత్నించగా.. అడ్డుకున్నారు పోలీసులు.. ఆయన కోసం ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి.. పంపించారు.. దీంతో, పోలీసులు, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.