దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుంది అని మండిపడ్డారు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ.. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్న ఆయన.. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ఈనెల 29న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. విజయవాడలోని రాజ్ భవన్ దగ్గర పెద్దఎత్తున నిరసన చేపడతామన్న ఆయన.. సీబీఐ, ఈడీ వ్యవస్థలు బ్లాక్ మెయిల్స్ గా మారాయని విమర్శించారు. ఎన్ని తప్పులు చేసినా బీజేపీలో ఉంటే ఎటువంటి ఈడీ దాడులు ఉండవని మండిపడ్డారు..…
CPI RamaKrishna: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బుగ్గన అప్పులు తెస్తెనే …జగన్ బటన్ నొక్కే దౌర్భాగ్య పరిస్థితి ఉందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం దొంగలు మాత్రమే బాగున్నారని చురకలు అంటించారు. మూడున్నరేళ్లలో రైతుకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని విమర్శలు చేశారు. కనీసం కడపలో పిల్ల కాలువను కూడా జగన్ తవ్వలేదన్నారు. జగన్ ఎక్కడికి…
CPI Ramakrishna: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్‌లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా…
CPI Ramakrishna: ఈనెల 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతిలో బుధవారం నాడు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. ఏపీని మోదీ అన్ని విధాలుగా మోసం చేసి సిగ్గు లేకుండా వస్తున్నారని.. ఒక్క అంశంలోనైనా మోదీ ప్రభుత్వం న్యాయం చేసిందా అని ప్రశ్నించారు.…
CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసే ముందు బీజేపీ విషయంలో క్లారిటీ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ విషయంలో క్లారిటీ ఇస్తే.. పవన్, చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఏ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌కు లేనన్ని శాఖలను విజయసాయిరెడ్డికి అప్పజెప్పారని.. వైసీపీని మోదీ- అమిత్…