CPI Ramakrishna Fires On YSRCP Govt: రాష్ట్రం ప్రభుత్వం దివాలా తీసింది.. అభివృద్ధి పని ఎక్కడా జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నూలులోని కోడుమూరులో నిర్వహించిన రైతు రక్షణ పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒక్క సాగునీటీ ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్ట్‌ల ఊసేలేదని మండిపడ్డారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని చెప్పి.. చివరికి అందులో నీళ్లు లేకుండా చేశారని చెప్పారు. గాలేరు నగరిని గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌కి ఛాలెంజ్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా
కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌లో నీళ్ళు ఉన్నప్పటికీ, కాల్వలు లేవని రామకృష్ణ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తే.. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, నకిలీ విత్తనాల వల్లే రైతులు నష్టపోయారని శాస్త్రవేత్తలు తేల్చారని వెల్లడించారు. పంట నష్టపోతే.. ఒక మంత్రి గానీ, ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకి సీడ్ కంపెనీ ఉందని.. ఆయనే రింగ్ లీడరని ఆరోపించారు. సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఇద్దరు మంత్రులున్నా.. ఏనాడూ రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవని ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Shraddha Walker Like Incident: శ్రద్ధా వాకర్ తరహాలో మరో ఘటన.. మహిళను చంపి, 50 ముక్కలు చేసి..
రైతుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాట చేస్తుందని, కర్నూలు జిల్లాలో ఇప్పటికే తమ పార్టీకి చెందిన 4 బృందాలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. సీఎం జగన్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కాకుండా.. పొలం పొలానికి వెళ్తే రైతుల పంట నష్టాలు, కష్టాలు తెలుస్తాయని సూచించారు. నకిలీ విత్తనాల అమ్మకాల్లో వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. ఆయన పాత్రపై విచారణ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.