CPI Ramakrishna: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరు ఇచ్చారని సీసీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. అంతగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని జగన్ భావిస్తే కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి పెట్టుకోవాలని సూచించారు. జగన్ నిర్ణయం…
హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో అధికారమే పరమావధిగా బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. బీజేపీ తీరుపై అటు అధికార వైసీపీ, విపక్షంలో వామపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా సీపీఐ నేత రామకృష్ణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాలు రెండు లక్షల మంది పోలవరం...
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న రాత్రి సుబ్రమణ్యం భార్యను, కుటుంబ సభ్యలు ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అంతేకాకుండా అర్థరాత్రి వీడియో నడుమ 5గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అంతేకాకుండా సుబ్రమణ్యంది హత్యేనని ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. అయితే నేడు సుబ్రమణ్యం సొంతూరులో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనంతపురంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోరు గర్జనకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అటు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురంలో వామపక్షాల నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట…
పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ‘పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా’ అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారు?చర్చలకు ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పింది. పీఆర్సీఫై ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్టపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందన్నారు రామకృష్ణ. పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.…
ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు గుడివాడ ఘటనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుడివాడలో ఎలాంటి క్యాసినో జరగలేదని, విపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినో వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. క్యాసినో ఎక్కడ జరిగినా జరిగింది వాస్తవమా కాదా?…
ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు.. అయినా ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లవ్ కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతోంది.. జనసేన పార్టీని ఉద్దేశించి చంద్రబాబు ఆ కామెంట్లు చేయగా.. బీజేపీ, వైసీపీ ఈ వ్యవహారంపై మండిపడుతోంది.. జనసేన పార్టీ తమకు మిత్రపక్షమని బీజేపీ అంటుంటే.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్కసారైనా గెలిచారా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా పర్యటనలో…