కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముంబయి- గాంధీనగర్ మధ్య నూతనంగా ప్రారంభించిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి
ఈ సృష్టి విచిత్రం. బద్ధ శత్రువులు కూడా కలిసిపోతుంటారు. జంతువులు కూడా తమ జాతి వైరాన్ని మరిచి పోతుంటాయి. కుక్క-కోతి, పిల్లి-కుక్క, కుక్క-కోడి ఇలా అనేకం కలిసి మెలిసి జీవిస్తుంటాయి. అలాంటిదే ఇది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామంలోని గోమాత మేక పిల్లకు తల్లిగా ప్రేమను పంచి పెడుతోంది. తల్లి లేని మేక పిల్లకు గోమాత పాలిచ్చి లాలిస్తూ అక్కున చేర్చుకుంది. బతకల సవరయ్యకు చెందిన మేక పది రోజుల క్రిందట మేక పిల్లకు…
సాంకేతికంగా ప్రపంచం ఎంతగా అభివృద్ది చెందుతుంటే… అంతగా మూఢనమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. రోగాలు నొప్పులకు నాటువైద్యం, పాము కరిస్తే కోడితో వైద్యం చేయడం చూశాం. అప్పట్లో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాము కరిస్తే ఎవరైనా వైద్యుని వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షేర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్రి పాముకాటుకు గురైంది. వంట చెరుకు సేకరణకు వెళ్లిన సమయంలో…
యూపీలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ సొంత నియోజక వర్గంలో డైరీ, విద్య, ఆరోగ్యం వంటి 22 రకాల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో పశువుల పోషణకు గర్వ పడుతున్నానని, కాని కొందరు మాత్రం దానిని పాపంగా పోలుస్తున్నారని అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు పశువులపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి పశువులపై జోక్ వేయడం మంచిది కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.…
ఆవును మనం గోమాతగా పూజిస్తాం. కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిందో ఆవు. దీంతో దాని యజమాని ఆపరేషన్ చేయించి ఆ గొలుసుని బయటకు తీయించాడు. కర్ణాటకలోని హీపనహళ్లిలో జరిగిన ఘటన వైరల్ అవుతోంది. అసలు ఆ గొలుసు ఎలా మాయమైంది. ఎలా కనిపెట్టారో చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు.…
మనదగ్గర ఒట్టిపోయిన ఆవులను కబేళాకు తరలించి వధిస్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో ఆవులను కేవలం ఆహారం కోసమే పెంచుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఆవును కబేళాకు తరలించాడు. అక్కడ దానిని వధించేందుకు సిద్ధం కాగా వారి కళ్లుకప్పి ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. అక్కడే ఉంటే పట్టుకుంటారని భావించిన ఆ గోవు 800 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని రియోడి జెనెరియోలో చోటుచేసుకుంది. Read: ఉత్కంఠభరితంగా సాగిన బ్రెజిల్-…
రోజురోజుకు సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరుస్తున్నారు.. లింగ బేధాలను పట్టించుకోవడంలేదు.. చివరికి ముగా జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా ఒక కామాంధుడు కామంతో ముగా జీవమైన ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హర్యానా లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సోనీపత్ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఒక యువకుడు నివసిస్తున్నాడు. ఇటీవల అతడు ఇంటి దగ్గరకు వచ్చిన ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.…
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వింతల్లో ఇది కూడా ఒకటి. రష్యాలోని ఖర్కాసియా పరిధిలో మెట్కెచిక్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఆవుకు వింత దూడ జన్మించింది. రెండు తలలతో దూడ జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలా రెండు తలలతో జన్మించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వింత దూడ తలభాగం ఆవుమాదిరిగా ఉన్నప్పటికీ, మిగతా శరీర భాగం పంది ఆకారంలో ఉన్నది.…
కలియుగంలో ఎక్కడ ఎలాంటి వింతలు జరుగుతాయో తెలియడంలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్ని వింత వింతలు జరుగుతున్నాయి. మనుషులు పాల కోసం ఆవులను పెంచుతుంటారు. కొన్ని ఆవులు ఎంత పితికినా పాలు ఇవ్వవు. కొన్ని వద్దన్నా పాలు ఇచ్చేస్తుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం అన్నింటికంటే స్పెషల్. ఈ ఆవు పొదుగును పితక్కపోయినా పాలు ఇచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆ ఆవు యజమాని వెంకటరమణారెడ్డి పేర్కొన్నాడు. చిత్తూరు జిల్లాలోని వడమాల మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలోని వెంకటరమణారెడ్డికి…
తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. అయితే దీనిని భజరంగ్ ధళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బైపాస్ లలో 300, 500 చిల్లరకు ఆశపడి లారీలను వదిలేస్తున్నారు కొందరు పోలీసులు. పది గోవులు తరలించాల్సిన లారీలో 50కి పైగా తరలిస్తున్నారు అక్రమార్కులు. మెడలు విరిచి లారీలో కుక్కి అత్యంత క్రూరంగా తరలింపుకు యత్నం చేస్తున్నారు. ఊపిరాడక కొన్ని మూగజీవాలు అందులో చనిపోతున్నాయి. చంద్రగిరి, నిన్న తిరుచానూరులో లారీలను అడ్డుకున్న హిందూ సంఘాలు… అక్రమ రవాణాను అరికట్టాలని…