మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వింతల్లో ఇది కూడా ఒకటి. రష్యాలోని ఖర్కాసియా పరిధిలో మెట్కెచిక్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఆవుకు వింత దూడ జన్మించింది. రెండు తలలతో దూడ జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలా రెండు తలలతో జన్మించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వింత దూడ తలభాగం ఆవుమాదిరిగా ఉన్నప్పటికీ, మిగతా శరీర భాగం పంది ఆకారంలో ఉన్నది. కాళ్లు కూడా పంది కాళ్లు మాదిరిగా ఉన్నాయి. ఈ వింతదూడ జన్మించిన గంటల వ్యవధిలోనే మృతి చెందింది. అయితే, ఈ వింత దూడ జన్మించే ముందు ఏడు గంటలపాటు తల్లిఆవు నరకయాతన అనుభవించింది. దూడ జన్మించి మరణించిన వారం రోజుల తరువాత తల్లిఆవు కూడా మృతి చెందింది. జన్యులోపం కారణంగా జన్మించిన వింత దూడ పుట్టిన తరువాత ఆ తల్లిఆవుకు ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని, కృతిమ పద్ధతుల్లో గర్భధారణనే చేపడుతున్నారని, ఫలితంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు.
Read: 40 ఏళ్ల క్రితం మాయమైన 20 ఏళ్ల అమ్మాయి… ఇప్పటికీ మిస్టరీగానే…