యూపీలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ సొంత నియోజక వర్గంలో డైరీ, విద్య, ఆరోగ్యం వంటి 22 రకాల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో పశువుల పోషణకు గర్వ పడుతున్నానని, కాని కొందరు మాత్రం దానిని పాపంగా పోలుస్తున్నారని అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు పశువులపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి పశువులపై జోక్ వేయడం మంచిది కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read: తమిళనాడులో ఒమిక్రాన్ విజృంభణ… ఒక్కరోజులో 33 కేసులు…
వారణాసిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగి ప్రభుత్వం డైరీ రంగంపై దృష్టి పెట్టిందని, ఆరేడు సంవత్సరాలతో పోలిస్తే దేశంలో పాల ఉత్పత్తి 45 శాతం మేర పెరిగినట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో భారత్ వాటా 22 శాతంగా ఉందని అన్నారు. కోట్లాదిమందికి గోవులు, గేదెలు ఉపాధి కల్పిస్తున్నాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.