మనదగ్గర ఒట్టిపోయిన ఆవులను కబేళాకు తరలించి వధిస్తుంటారు. అయితే, కొన్ని దేశాల్లో ఆవులను కేవలం ఆహారం కోసమే పెంచుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఆవును కబేళాకు తరలించాడు. అక్కడ దానిని వధించేందుకు సిద్ధం కాగా వారి కళ్లుకప్పి ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. అక్కడే ఉంటే పట్టుకుంటారని భావించిన ఆ గోవు 800 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని రియోడి జెనెరియోలో చోటుచేసుకుంది.
Read: ఉత్కంఠభరితంగా సాగిన బ్రెజిల్- అర్జెంటైనా మ్యాచ్…
రియోలోని ఓ కబేళా నుంచి తప్పించుకొని 800 కిమీ ప్రయాణం చేసి నోవా గ్రానెడా లోని వాటర్ పార్క్‌కు చేరుకుంది. ఆ పార్క్‌లోని ఓ వాటర్ స్లైడర్ ఎక్కి దానిపై జారుతూ ఎంజాయ్ చేసింది. ఈ దృశ్యాలను ఆ పార్క్ యజమాని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆ ఆవు కబేళా నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చినట్టుగా గుర్తించాడు. కాగా, ఆ ఆవుకు టొబొ అని నామకరణం చేశాడు. ఆ ఆవును వాటర్ పార్క్‌లోనే ఉంచాలని టూరిస్టులు కోరడంతో అక్కడే ఉంచారు. ఇప్పుడు ఆ పార్క్‌లో ఆ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.