కలియుగంలో ఎక్కడ ఎలాంటి వింతలు జరుగుతాయో తెలియడంలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్ని వింత వింతలు జరుగుతున్నాయి. మనుషులు పాల కోసం ఆవులను పెంచుతుంటారు. కొన్ని ఆవులు ఎంత పితికినా పాలు ఇవ్వవు. కొన్ని వద్దన్నా పాలు ఇచ్చేస్తుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం అన్నింటికంటే స్పెషల్. ఈ ఆవు పొదుగును పితక్కపోయినా పాలు ఇచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆ ఆవు యజమాని వెంకటరమణారెడ్డి పేర్కొన్నాడు. చిత్తూరు జిల్లాలోని వడమాల మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలోని వెంకటరమణారెడ్డికి రెండున్నరేళ్ల ఆవు ఉన్నది. ఆ ఆవు ఇంకా ఏతకు రాలేదు. అయినప్పటికీ పాలు ఇస్తుందట. పితక్కుండానే పాలు ఇస్తున్నది. మార్చినెల నుంచి ప్రతి నాలుగురోజులకు ఒకసారి పితక్కుండానే ఆవు పాలిస్తోందని యజమాని చెబుతున్నాడు. ఈ విషయం వారి ద్వారా వీరి ద్వారా ఆ జిల్లా మొత్తం వ్యాపించింది. పితక్కుండానే పాలిచ్చే ఆవును చూసేందుకు ప్రజులు నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగకు క్యూ కడుతున్నారు.
Read: బంగ్లాలోనూ…పాక్ ఘటన…హిందూ ఆలయంపై దాడి…