ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి బెడద 2 సంవత్సరాల నుంచి పోవడం లేదు. కరోనా కట్టడికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని తలచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం టీకాఉత్సవ్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 130 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్‌లను పంపిణీ చేశారు. అయితే తాజాగా తెలంగాణలో 100 శాతం తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పూర్తైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 61 శాతం మందికి రెండు…
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్…
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. రాష్ట్రంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య ఓసారి కిందకు.. మరోసారి పైకి కదులుతూనే ఉంది.. అయితే, కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం వైఎస్ జగన్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతం కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్టు…
కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ఊపందుకుంది.. ఒకప్పుడు రోజుకు లక్షల్లో డోసులు వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఒకేరోజులో రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది భారత్.. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అర్హులైన జనాభా అంతటికీ కనీసం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాలనే లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.…
పర్యాటక ప్రదేశాల వద్ద జనం గుమికూడవద్దు. “కోవిడ్” ప్రవర్తనా నియమాలను పాటించాలి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాస్కు ధరించి , భౌతిక దూరం పాటించాలి. కేవలం అధికార యంత్రాంగమే కాదు, ప్రజల భాగస్వామ్యంతోనే “కరోనా”ను జయించవచ్చు. ఇక స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశ చారిత్రక సంపదను డిజిటలైజేషన్ చేస్తున్నాం అని తెలిపారు. 18 కోట్ల డాక్యుమెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పురాతన, చారిత్రక సంపద ను…
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులు కూడా కరోనా టీకా వేసుకొని అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ తన స్టాప్ తో కలిసి వ్యాక్సిన్ తీసుకుంది. టీకా ఇంజక్షన్ తీసుకునే సమయంలో తెగ వణికిపోతూ కంగారు పడింది. మెహరీన్ ఫోటోని సైతం షేర్ చేసి టీకా అనుభవాన్ని పంచుకొంది. టీకా అందరూ విధిగా వేసుకోవాలని.. దీన్ని నేషనల్ డ్యూటీగా భావించి చేయాలని మెహరీన్ పేర్కొంది. కాగా, కరోనా…
కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో…
నటి సంజనా గల్రానీ ఆదివారం బెంగళూరులో కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకుంది. ఈ సందర్భంగా అక్కడి వైద్య సిబ్బంది సేవలు చూసి ఫిదా అయిపోయింది సంజనా. వారి అంకిత భావం చూస్తుంటే గర్వంగా ఉందంటూ పొగిడేసింది. అంతేకాదు… ఎవరైనా కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకోవాలనుకుంటే ఉచితంగా అందించడానికి తాను సిద్ధమని, సంజనా ఫౌండేషన్ కు మెయిల్ ద్వారా వివరాలు తెలియచేస్తే వారికి వాక్సిన్ వేయిస్తామని హామీ ఇస్తోంది. ఇటీవల కూడా సంజనా కరోనా బాధితులకు ఆహారాన్ని అందించడంతో పాటు సినీ…
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లుగా ఒక వీడియో ద్వారా తెలిపారు. ‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా తీవ్రత మనలో తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు…
అపరకుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్… తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ కార్పొరేట్ దిగ్గజం నిర్ణయానికి వచ్చింది.. దీని కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది.. రిలయన్స్‌తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి…