దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులు కూడా కరోనా టీకా వేసుకొని అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ తన స్టాప్ తో కలిసి వ్యాక్సిన్ తీసుకుంది. టీకా ఇంజక్షన్ తీసుకునే సమయంలో తెగ వణికిపోతూ కంగారు పడింది. మెహరీన్ ఫోటోని సైతం షేర్ చేసి టీకా అనుభవాన్ని పంచుకొంది. టీకా అందరూ విధిగా వేసుకోవాలని.. దీన్ని నేషనల్ డ్యూటీగా భావించి చేయాలని మెహరీన్ పేర్కొంది. కాగా, కరోనా సెకండ్ వేవ్ తో మెహ్రీన్ పెళ్లి వేడుక వాయిదా పడింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎఫ్3’ సినిమాతో పాటు, మారుతి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లోను నటిస్తోంది.