పర్యాటక ప్రదేశాల వద్ద జనం గుమికూడవద్దు. “కోవిడ్” ప్రవర్తనా నియమాలను పాటించాలి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాస్కు ధరించి , భౌతిక దూరం పాటించాలి. కేవలం అధికార యంత్రాంగమే కాదు, ప్రజల భాగస్వామ్యంతోనే “కరోనా”ను జయించవచ్చు. ఇక స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశ చారిత్రక సంపదను డిజిటలైజేషన్ చేస్తున్నాం అని తెలిపారు. 18 కోట్ల డాక్యుమెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పురాతన, చారిత్రక సంపద ను “నేషనల్ మ్యూజియం”లో పొందు పరిచారు. ఒరిజినల్ రాజ్యాంగ ప్రతి ఇక్కడే ఉంది. “సెంట్రల్ విస్టా” ప్రాజెక్టులో కొత్త నిర్మాణాలు వచ్చినా ,. చారిత్రక సంపదను కాపాడుకుందాం అని పేర్కొన్నారు.