భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. భారత్‌లో కరోనా మరణాలు వెయ్యికి పైగా నమోదు అయ్యాయి..
Read Also: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. వెండి మాత్రం..
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదైంది.. అంటే 24 గంటల వ్యవధిలోనే 1,188 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. దీంతో.. మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. మరోవైపు ఇప్పటి వరకు దేశ్యాప్తంగా 170 కోట్లకు పైగా అంటే 1,70,21,72,615 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు తెలింది.. దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది.