దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు మరెన్నో ఇతర దేశాలకు ఎగుమతి చేశాం. ఎన్నో లక్షలమందిని కాపాడాం. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 120 కోట్ల రూపాయలు కేటాయించాం అన్నారు కేంద్రమంత్రి. ఇక్కడ వైద్య సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలో ఆరు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చామన్నారు. త్వరలోనే ఈ ఆసుపత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ వై కె నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నీరజ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్డీఓ మధుసూదన్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ రాజగోపాల్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 195.19 కోట్ల టీకా డోసులు వేశారు. 12-14 ఏళ్ల వయసు పిల్లల్లో ఇప్పటి వరకు ఇచ్చిన మొదటి డోసు టీకాలు 3.51 కోట్లు. ప్రస్తుత యాక్టివ్ కేసులు 47,995. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ఆందోళనకరంగా మారింది. మంగళవారం 6594 కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు బలవగా, 5718 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Polio Virus: పదేళ్ల తరువాత ఇండియాలో పోలియో వైరస్ గుర్తింపు