ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ కాటుతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య నవంబర్ 1వ తేదీ నాటికి 50.01 లక్షలకు చేరింది. కరోనా వైరస్ ధాటికి ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రపంచంలోని…
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది.. బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, వృద్ధుల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, మృతుల సంఖ్య పెరగడం.. వైద్యవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.…
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గినట్టే కనిపించినా.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే, తాజా బులెటిన్ ప్రకారం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 29,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 415 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 42,363 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.…
కర్నూలు జిల్లాలో కరోనాతో చనిపోయిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇదే వాస్తవమని తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలో 1,12,956 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,12,575 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వైరస్ సోకినవారిలో 751 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 3,630 వున్నాయి. అయితే కరోనా బారిన పడినవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 2వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం మృతులు…
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. ఇక హైదరాబాద్ నగరంలోను కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కో స్మశానంలో రోజుకు 10 కి పైగా మృతదేహాలు వస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. కోవిడ్-నాన్ కోవిడ్ మృతదేహాలను వేర్వేరుగా దహనాలు చేస్తున్నామని చెప్తున్నారు.…