Covid Deaths in Andhra Pradesh: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఇదే సమయంలో.. కోవిడ్ బారినపడి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు పెరగడంతో పాటు.. కొన్ని కోవిడ్ మరణాలు సంభవించినట్టు వార్తలు వచ్చాయి.. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది.. రాష్ట్రంలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.. రాష్ట్రంలో ఈ మధ్య ముగ్గురు మృతిచెందారన్న ప్రచారంపై స్పందించిన ఆయన.. వివరణ ఇచ్చారు.
Read Also: Astrology : ఏప్రిల్ 20, గురువారం దినఫలాలు
కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తికి ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అయితే, వైరల్ న్యూమోనియా కారణంగా మరణించాడని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని తెలిపారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్. అలాగే 26 ఏళ్ల సందీప్ అనే వ్యక్తికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.. నెక్రోటైజింగ్ ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్టు నివేదికలో సూపరింటెండెంట్ పేర్కొన్నారని తెలిపారు.. మరోవైపు.. వైజాగ్‌లో 21 ఏళ్ల పి.చింటో కూడా వైరల్ న్యూమోనియాతో మరణించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని.. అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ అని తేలిందని పేర్కొన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.