వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారత ప్రభుత్వం.. ఈ ఏడాదిలోనే 100 శాతం వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.. అయితే, ఇంకా ప్రజలను అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొందరు ఫస్ట్ డేసు వేసుకోవడానికే ముందుకు రాకపోగా.. మరోవైపు.. ఫస్ట్ డోస్ తర్వాత రెండో డోసు తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.. ఇటీవలే వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. కానీ, ఫస్ట్ డోసు, సెకండ్ డోసులు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.. క్రమంగా అందరికీ వ్యాక్సిన్ వేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది సర్కార్.. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నవారికే జీతాలు, వ్యాక్సిన్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్ వేసుకుంటేనే ట్రావెలింగ్ అవకాశం అంటూ పలు షరతులు విధిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది భారత్.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్ల మార్క్‌ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే కాగా… వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ.. స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశం కానున్నారు.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఏడు వ్యాక్సిన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ అవుతారు.. ఈ సమావేశానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్,…
కరోనా మహమ్మారి ప్రస్తుతానికి శాంతించింది. ఈ వేసవి ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇప్పుడిప్పుడే భారతదేశం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులందరికీ భారతదేశం 100 కోట్ల ప్లస్ కరోనావైరస్ వ్యాక్సిన్‌లను వేయడం విశేషం. ఈ ఫీట్ ను సాధించడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య బృందం చేసిన కృషికి గానూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ట్విట్టర్‌లో దేశంలోని రియల్ హీరోలు ఫ్రంట్‌లైన్ వైద్య…
ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఈ యేడాది ఏప్రిల్ 17వ తేదీ హఠాన్మరణం చెందారు. కమెడియన్ గా, సహృదయుడిగా చక్కని పేరు తెచ్చుకున్న వివేక్ మరణంతో తమిళ చిత్రసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దానికి కారణం ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు కొవిడ్ 19కు వాక్సిన్ వేయించుకోవడమే! ఆయన మరణానికి వాక్సిన్ వేయించుకోవడం కారణం కాదని ఆరోగ్యశాఖ అప్పుడే వివరణ ఇచ్చింది. అయినా కొన్ని మీడియా సంస్థలు వాక్సిన్ వికటించి వివేక్ మరణించారంటూ ముమ్మరంగా ప్రచారం చేశాయి.…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్‌పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు,…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక,…
అక్టోబర్ 22వ తేదీ నుండి మహారాష్ట్రలోనూ సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్ ను తెరవబోతున్నారు. అయితే సినిమా థియేటర్లు, ఆడిటోయంలలో కేవలం సిట్టింగ్ కెపాసిటీలో యాభై శాతానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మంగళ వారం మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 2020 మార్చిలో సినిమా థియేటర్లను కరోనా కారణంగా మూసివేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాలలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో థియేటర్లను పాక్షికంగా తెరిచారు. కానీ కరోనా…
“అఖండ” టీంలో మరోసారి కరోనా కలకలం రేగింది. భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే తెలుగు చాల చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది రివర్స్ అయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే షూటింగ్ సెట్ లో ఒక్కరికి కరోనా వచ్చినా అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే కరోనా, లాక్ డౌన్ అనంతరం షూటింగులు మొదలు పెట్టడానికి మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. ఆ తరువాత కూడా సెట్లో పలు కరోనా నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని సింగిల్ డోస్ అయితే, మెజార్టీ వ్యాక్సిన్లు మాత్రం డబుల్ డోస్‌వి.. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది… అయితే, ఫస్ట్, సెకండ్ డోస్ తీసుకున్నవారిలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. కానీ, వారిపై ప్రభావం అంతగా చూపలేకపోతోంది.. ఇదే సమయంలో, బూస్టర్ డోస్ బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. ఆ దిశగా…