ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా…
యువ భారత్ కదులుతోంది.. వ్యాక్సినేషన్ సెంటర్ల వైపు అడుగులు వేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతించిన తరుణంలో.. కేవలం మూడు రోజుల్లోనే కోటి మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లు కోవిడ్టీకాపంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. వ్యాక్సిన్వేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్న యువతను అభినందించారు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. తగ్గినట్టే తగ్గిన కోవిడ్ మళ్లీ పంజా విసురుతుండగా.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు బాటపడుతున్నాయి.. కోవిడ్ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దాని ప్రభావం ఉంటుంది.. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉంటుందని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువని.. ఒమిక్రాన్ మరణాలు కూడా తక్కువేనని పేర్కొంది.. ఇక, ఇప్పటికే ఒమిక్రాన్ వేరయంట్ 128 దేశాలకు వ్యాపించిందని చెబుతోంది..…
ఏపీలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 166 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77, 145 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 495 కి…
కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు ఎందరో రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి.. శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం…
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొదటల్లో వ్యాక్సిన్లకు ధరలు నిర్ణయించి విమర్శలపాలైన కేంద్ర సర్కార్.. ఆ తర్వాత పూర్తిగా ఉచితమని ప్రకటించింది.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ చేయించుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఇప్పటి వరకు వ్యాక్సిన్లపై ఎంత ఖర్చు చేశారంటూ సమాచార హక్కు చట్టం కింద ఎదురైన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కోవిడ్…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా.. వ్యాక్సినేషన్‌తో చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ..! నో వ్యాక్సిన్.. నో సాలరీ..! నో వ్యాక్సిన్.. నో జర్నీ..! లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఆయా సంస్థలు.. ఉద్యోగి మాత్రమే కాదు.. అతని కుటుంబసభ్యులు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతం ఇచ్చేది అంటూ పలు ప్రభుత్వ శాఖలతో పాటు.. కొన్ని ప్రైవేట్ సంస్థలు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది.. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా ప్రంపచదేశాలకు వ్యాపిస్తోంది.. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 89 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.. మరోవైపు.. ఒమిక్రాన్ నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.. కిస్మస్…
సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ మొదలైంది.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్ బెటరా..? కోవిషీల్డ్…