కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా పిలుస్తున్న చైనాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కేసులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. మరోవైపు ఉత్తర చైనాలోని హార్బిన్ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్‌మెంట్ వాసులకు ప్రమాదం పొంచిఉన్న కారణంగా తప్పని…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది.…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. భారత్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఫస్ట్‌వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.. ప్రాణనష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది.. అయితే, ప్రస్తుతం కరోనా రోజువారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది.. కానీ, మళ్లీ ముప్పు పొంచేఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం..…
కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం కొంతకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా తుదిదశకు చేరుకుంది.…
కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు మొత్తం అతలాకుతం అవుతుంటే.. న్యూజిలాండ్ మాత్రం కరోనాను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది.. ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయితే.. ఏకంగా వారం రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.. న్యూజిలాండ్‌లో కరోనా కట్టడికి ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి.. అయితే, ఈ మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమెకు వింత ప్రశ్న ఎదురైంది.. దాంతో.. షాక్ తిన్న ఆమెకు ఓ…
కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నారులపైనే ప్రభావం చూపబోతుందంటూ పలు హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, పెద్దవారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోన్న మహమ్మారి.. చిన్నారులపై ఊపిరితిత్తులను ఏ స్థాయిలో దెబ్బతీస్తుందనేదానిపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు.. కానీ, కోవిడ్ వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఉన్నవారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని.. కోవిడ్ బారినపడినా.. వారి అవయవాల పనితీరులో పెద్దగా మార్పులు రావని గుర్తించారు శాస్త్రవేత్తలు.…
ఏపీలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63, 717 సాంపిల్స్ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1525 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,19,702 కు పెరగగా… రికవరీ కేసులు 19,90,916 కు చేరాయి.. ఇప్పటి…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే,…