కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్‌పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు, ఇతర వృద్ధి కారకాలపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావం నిలకడగా కొనసాగుతోందని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యం కావచ్చునని తెలిపింది.
కరోనా మహమ్మారి పరిస్థితులను భారత ప్రభుత్వం ధీటుగా, వేగంగా ఎదుర్కొందని ప్రశంసించింది ఐఎంఎఫ్.. ప్రజలకు ఆర్థిక మద్దతును అందజేసిందని, బలహీన వర్గాలకు సాయం చేసిందని, ద్రవ్య విధానాన్ని సులభతరం చేసిందని పేర్కొంది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ… లిక్విడిటీ ప్రావిజన్‌ను పెంచిందని, నియంత్రణ విధానాలను పటిష్టపరిచిందని తెలిపింది.. కరోనా మహమ్మారిపై భారత అధికారుల ప్రతిస్పందనను ఐఎంఎఫ్ డైరెక్టర్లు ప్రశంసించారు. ఆర్టికల్ IV కన్సల్టేషన్స్ అని పిలవబడే నివేదికలో ఐఎంఎఫ్ ఈ విషయాలను వెల్లడించింది.. అయితే, కోవిడ్ -19 మహమ్మారి నుండి వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించింది, ముఖ్యంగా ప్రజల అభివృద్ధిపై హానికరమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. మహమ్మారికి సంబంధించిన అనిశ్చితులు కారణంగా.. భారీ నష్టాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడి, మానవ వనరులు, మూలధనం, ఇతర వృద్ధి డ్రైవర్లపై కోవిడ్ -19 యొక్క నిరంతర ప్రతికూల ప్రభావం ఉందని… వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపింది.
ఇక, ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమీప కాల పాలసీ ప్రాధాన్యత ఉందని డైరెక్టర్లు అంగీకరించారు. ఆ సందర్భంలో, ఇటీవల వ్యాక్సినేషన్ పెరుగుదలను స్వాగతించారు.. మహమ్మారికి ముందు దశాబ్దంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి, మిలియన్ల మందిని పేదరికం నుండి బయటపడేసిందని పేర్కొంది.. కోవిడ్ -19 షాక్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ మోడరేట్ చేస్తున్నప్పుడు, మహమ్మారి అపూర్వమైన సవాళ్లను సూచిస్తుందని తెలిపింది. కోవిడ్ -19 సెకండ్ వేవ్.. ఆరోగ్యం మరియు ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి, అయితే, ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని విరించింది. 2020-21లో మునుపెన్నడూ లేని విధంగా 7.3 శాతం సంకోచించింది. రెండవ వేవ్ మరో పదునైన ఫలితాన్ని ఇచ్చిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని.. 2022-23లో 8.5 శాతం వృద్ధి సాధిస్తోందని అంచనా వేసింది ఐఎంఎఫ్.